కాంట్రాక్టు అధ్యాపకులకు అండగా ఉంటా – కొప్పిశెట్టి తో పల్లా

నల్గొండ జిల్లా సీజేఎల్స్ ఆత్మీయ సభలో సమాచార లోపం వలనే తప్పా సీజేఎల్స్ సమస్యలు పరిష్కరించడంలో ఎప్పటికీ మీ వెంటే ఉంటానని MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారని 475 సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

బదిలీల సమస్యపై 475 సంఘం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఏవిధంగా బదిలీలు చేసినా సరే కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో సంఘాల తప్పు లేదని సంఘం తరపున చేసిన ప్రకటనకు MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించి మనకు మద్దతుగా నిలవడం, భవిష్యత్ లో అన్ని సమస్యల సాధనలో సంపూర్ణ మద్దతుతో ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాననిహమీ ఇచ్చినట్లు సంఘ నాయకులు కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

2014 నుండి మన సమస్యల సాధనలో, అనేక ఉద్యమాల లో మన వెంట ఉండి మన కోసం మన సమస్యల సాధన కోసం కృషి చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి యావత్ కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు,