ఇంటర్ పాస్ గ్యారెంటీ షార్ట్ మెటీరియల్

కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విధ్యార్థుల కొరకు రూపొందించి గత సంవత్సరం ఇంటర్ కమీషనర్ గారి చేతుల మీదుగా షార్ట్ మెటీరియల్ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. లెక్చరర్ సయ్యద్ జబీ రూపోందించిన పాస్ గ్యారంటి మెటిరియల్ చాలా బాగుందని కమీషనర్ గారు మరియు RJD మేడం జయప్రదబాయి గారు ఇంటర్ విద్యా అధికారులు తదితరులు మెచ్చుకోవడం జరిగింది.


అనతి కాలంలోనే ఆరదణ లభించిన మెటీరియల్ మొదట 5000 కాపీలు ముద్రించి తెలంగాణ లోని అన్ని జిల్లాలలో పంపిణి చేయడం జరిగింది, ఈ మెటిరియల్ పుస్తకం MPC, BPC, CEC గ్రూప్ లలో తెలుగు మీడియం ద్వితీయ విద్యార్థుల కొరకు మొదట 12 సబ్జెక్టులు చాలా సునాయసంగ అర్థం అయ్యేలా క్వాలిటి తో కూడిన మెటీరియల్ ను విద్యార్థులకు అందించడం జరిగింది.

పాస్ గ్యారంటి పేరుతో తయారు చేసిన మెటీరియల్ టైటిల్ కు తగ్గట్టుగానే గత పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో 90 శాతానికి పైగా ప్రశ్నలు ఈ మెటీరియల్ నుండే వచ్చాయి.

జబీ ఉల్లా
 • కామర్స్ లొ 97% ,
 • సివిక్స్ లో 92%,
 • హిందీ లో 91%,
 • ఎకనామిక్స్ లో 90%,
 • జువాలజీ లో 80%,
 • వృక్ష శాస్త్రంలో 80%,
 • భౌతిక శాస్త్రంలో 73%,
 • రసాయన శాస్త్రంలో 73%,
 • ఇంగ్లీష్ లొ 91%,
 • తెలుగు లో 66%,
 • మ్యాథ్స్ A, 40%
 • మ్యాథ్స్ B 60% మార్కులు రావడం గొప్ప విషయం, ఎందుకంటే కేవలం సెలెక్టెడ్ కొన్ని ప్రశ్నలనే తీసుకోవడం ప్రత్యేకత.

మెటీరియల్ తయారి ఆలోచనకు ముఖ్య కారణం ఏంటి ? – రూపకర్త జబీ సార్ వివరణ ::

ప్రభుత్వ కళాశాల లలో ఉత్తీర్ణత శాతం పెరగాలనే ఉద్దేశ్యంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. కనుక కేవలం ప్రభుత్వ కళాశాలలనే దృష్టిలో ఉంచి మెటీరియల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మొదట నా హిందీ సబ్జెక్ట్ కు సంబందించి ఇలా ప్రతి సంవత్సరం షార్ట్ మెథడ్ లో ప్రశ్నలు సమాధానాలు తయారు చేసే వాడిని, ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్ కు డిస్టిక్ ఆవరేజ్ ముఖ్యం కనుక అందరికీ అవసరం అయ్యేలా అన్ని సబ్జెక్టులు ఇలానే తయారు చేస్తే బాగుండే అని మిత్రుల కోరికతో ఒక మెటీరియల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది,.

సీనియర్ అధ్యాపకుల సలహాలు సూచనలతో మరియు అన్ని సబ్జెక్టుల పబ్లిక్ పరీక్షల ప్రశ్నలు-అంశాల విశ్లేషణతో రూపకల్పన చేయడం జరిగింది, సమాధానాలు స్వల్పంగా ఉండేలా డైరెక్ట్ మెథడ్ పాయింట్ లో రాసాం, అన్ని సబ్జెక్టులు కేవలం నెల రోజులు చదివి వెనుకబడిన విద్యార్థి కూడా ఈజీగా పాస్ అయ్యేలా చూసాం, ఉదాహరణకు కామర్స్ విషయానికి వస్తే అకౌంట్స్ లెక్కలు తెలియని విద్యార్థి కూడా కేవలం థియరీ చదివి 70 మార్కులు సాధించేలా అకౌంట్ సెక్షన్ లో ఛాయిస్ గా ఇచ్చే థియరీని ఎంచుకున్నాం, ఇందులో నుండే మొన్న పరీక్షలలో 70 కు 68 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్ సబ్జెక్టులో వ్యాకరణం లోని కొన్ని సెక్షన్లు వదిలేసి 52 మార్కులకే చేసాం, ఇందులో మొన్న పరీక్షలలో 42 మార్కులు వచ్చాయి

ఒక గ్రూప్ లోని మొత్తం సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఉండేలా, మెటిరియల్ బుక్ ను చూసిన విద్యార్థికి భయం లేకుండా పాజిటివ్ ఆలోచలనలు వచ్చేలా బుక్ ను సన్నగా ఉండేలా చేసాం. తక్కువ పేజీలలో తక్కువ అంశాలతో రూపొందించాం. విద్యార్థి దగ్గర ఈ ఒక్క బుక్ ఉంటే చాలు అనే ధైర్యాన్ని ఇచ్చాం, కాలేజ్ కు స్టైల్ గా ఒకటే బుక్ ఊపుకుంటూ వచ్చే విద్యార్థి చేతిలో మా మెటీరియల్ ఉండేలా చేసాం, ఇది వెనుకబడిన విద్యార్థికే కాకుండా చురుకైన విద్యార్థి కూడా పరీక్షకు ఒక రోజు ముందు కూడా పేజీలు తిరగేసి ముఖ్యమైన సమాధానలు పునశ్చరణ చేసుకోవచ్చు!

ప్రభుత్వ కళాశాల లలో పేద విద్యార్థులు ఉంటారు కనుక ధర కూడా తక్కువ ఉండేలా చూసాం, ప్రింటింగ్, పంపిణి మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఒక సబ్జెక్ట్ కేవలం 17 రూపాయలు పెట్టడం జరిగింది, సేవా, కళాశాలల అభివృధ్ది, వంద శాతం ఫలితాలు అనే ఆశించాం, ఆర్థిక లాభం కోసం నా ఆలోచన కాదు, మెటీరియల్ రిలీజ్ చేసిన కమీషనర్ గారు అదే రోజు ఆఫర్ ఇచ్చినా కూడా మేం ఏ ఆఫర్ ను స్వీకరించ లేదు, వారం రోజుల తర్వాత RJD మేడం గారు ఫోన్ చేసి అభినందించి ఇంగ్లీష్ మీడియం కూడా రూపొందించాలని సలహానిచ్చారు,

ఈ విద్యా సంవత్సరం తప్పిన హిస్టరీ గ్రూప్ తో పాటు ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టులు, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రణాళిక రూపొందించాం కాని కరోనా కారణంగా ముందుకు వెళ్ళలేక పోయాం, రానున్న విద్యా సంవత్సరంలో అన్నీ అందించనున్నాం

ఆదరిస్తున్న అధ్యాపకులకు, విద్యార్థులకు మరియు ప్రోత్సహిస్తున్న అధికారులకు, మెటీరియల్ తయారు చేయడంలో సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్వాదాలు-


పాస్ గ్యారంటీ రూపకర్త -జబీ సార్

మెటీరియల్ కోసం సంప్రదించండి

జబీ ఉల్లా

మొబైల్ నంబర్ :: 9949303079