ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో పెట్రోల్‌పై 2.50, డీజిల్‌పై 4.0 రూపాయలు అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించనున్నట్టు ప్రకటించారు.
ఇవే కాక ఇతర ఉత్పత్తులైన మద్యం ఉత్పత్తులపై 100, ముడి పామాయిల్‌పై 17.5, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20, యాపిల్‌పై 35, బంగారం, వెండిపై 2.5 చొప్పున, బఠానీలపై 40, కాబూలీ శనగలపై 30, శనగలపై 50, పత్తిపై 5 శాతం వరకు అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీంతో వీటి ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశముంది.