మంత్రుల దృష్టికి సీజేఎల్స్ సమస్యలు.

వరంగల్ లో నిర్వహించిన టీజీవో సమావేశానికి హజరయిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు మరియు శ్రీనివాస్ గౌడ్ లను వరంగల్ జిల్లా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సమస్యలైన క్రమబద్ధీకరణ కేసు, జి.ఓ నంబర్ 16 మరియు బదిలీలు, భద్రత గురించి 475 ఉమ్మడి వరంగల్ నాయకులు వస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలిసి విన్నవించడం జరిగింది.

దీనిపై స్పందించిన మంత్రులు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను సీఎం మరియు విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం కొరకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.