తరగతి గదిలో 50 శాతం మంది విద్యార్థులకే అనుమతి – సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నందని ఈ నేపధ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ రోజు SCERT కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలన్నారు.

ప్రతి రోజు శానిటైజేషన్‌ చేసేందుకు వీలుగా ప్రతీ యూనివర్సిటీకి రూ. 20 లక్షలు తక్షణసాయంగా అందించాలని ఆదేశించారు. కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను విద్యార్థులకు కల్పించాలన్నారు. కాలేజీల్లో విద్యార్థులు గుమికూడకుండా, విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే నన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు