మాకొద్దు ఈ పీఆర్సీ

తెలంగాణ తొలి పీఆర్సీ సిఫార్సులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

వెంటనే పీఆర్సీ కమిటీని రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘం నేతలు ప్రతులను చించి వేస్తున్నారు. తమ వేతనాలను తగ్గించడానికి వేసిన కమిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా ఆలోచించి మంచి ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సు చేసినట్లు సమాచారం. పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీపై అసంతృప్తి వ్యక్తం చేస్తన్నారు.

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుండి 27శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే పిఆర్సి ఇవ్వవలసిన 31 నెలల తర్వాత కేవలం 7.5 శాతం తో ఫిట్ మెంట్ ఇవ్వడం దురదృష్టకరమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు