కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పీఆర్సీ ! – నివేదిక

తెలంగాణ తొలి పిఆర్సీ రిపోర్టు ఇందులో XIX చాప్టర్లో 261 పేజీ నుంచి 278 పేజీ వరకు మొట్టమొదటిసారిగా కాంట్రాక్టు &ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి పేర్కొనడం జరిగింది. ఇందులో జూనియర్ కాలేజీలో మరియు పాలిటెక్నిక్ కాలేజీలో మరియు డిగ్రీ కాలేజీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్ గురించి వివరంగా రాయడం జరిగింది.

ఇందులో జూనియర్ కాలేజ్ కాంటాక్ట్ లెక్చరర్లకు నెలకు 54, 220/- మరియు డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్స్ లెక్చరర్ లకు 58,850/- నెలకు, పాలిటెక్నిక్ 58,850/- నెలకు పెంచవలసిందిగా రికమండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి వెయిటేజి ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని సూచించడం జరిగింది.

రెగ్యులర్ వాళ్లకు ఇచ్చేటట్లు అన్ని ఒక E.L (EARNED LEAVE) ఒక్కటి తప్ప, మిగతా సెలవులు ఇవ్వాలని సూచించడం జరిగింది తెలంగాణ తొలి పిఆర్సీ సమావేశం గౌరవ ఛైర్మన్ బిశ్వాల్ గారు ఆధ్వర్యంలో జరిగిన సమయంలో గతంలో కాంట్రాక్టు లెక్చరర్ ల అసోసియేషన్ ద్వారా సమస్యలను వారికి తెలియ చెప్పడం జరిగింది.

ఈ సందర్భంగా తొలిసారిగా పీఆర్సీ నివేదికలో తమ గురించి పేర్కొనడం పై కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

TELANGANA PRC 2020 PDF FILE

https://drive.google.com/file/d/1bDSgvLg5dzU0PQUdwYqsIEDbhmwojkLO/view?usp=drivesdk