పోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే మరియు ఇతర పద్దతిలలో UPI ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గమనిక. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI)ని అప్గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సూచించింది.
అయితే అది ఎన్ని రోజులనేది NPCI చెప్పలేదు. కొద్ది రోజుల పాటు యూజర్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని, చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
రాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజామున 3 వరకు చేసే పేమెంట్స్ సక్రమంగా జరుగక మనీ ట్రాన్సపర్ కాకపోవచ్చు అని, మీ ఎకౌంటు లో డబ్బులు డెబిట్ అయినప్పటికీ మీరు పంపిన ఎకౌంటు లోకి డబ్బులు క్రెడిట్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు.