బదిలీల పై కేసీఆర్ హమీని వెంటనే అమలు చేయాలి – TIGLA నిరసన సభలో కొప్పిశెట్టి

ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న పలు సమస్యల మీద పరిష్కారం కోరుతూ తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (TIGLA) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నాంపల్లి లో ఉన్న ఇంటర్మీడియట్ కమిషనర్ ఆవరణలో ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సంఘం 475 రాష్ట్ర కార్యదర్శి సురేష్ మీడియాతో మాట్లాడుతూ…

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో ఉన్న సమస్యలను కమిషనర్ మరియు ప్రభుత్వ పెద్దలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు గత 13 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయినా బదిలీలను సీఎం కేసీఆర్ హామీ మేరకు వెంటనే మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీలు జరపాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో 475 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, శోభన్, వస్కుల శ్రీను, జబి ఉల్లా, కురుమూర్తి, శైలజ తదితరులు పాల్గొన్నారు.