ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు – సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

ఈ వారంలోనే ఈ విషయం పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంద‌ని సీఎం అన్నారు.

ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామ‌న్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. EWS తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయ‌ని సీఎం పేర్కొన్నారు