ఈ నెల 22 తేదీన ఇంటర్ విద్యలో ఉన్న పలు సమస్యల పరిష్కారానికై కమీషనర్ కార్యాలయంలో గల ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాం ముందు “భోజన విరామ” సమయములొ TIGLA సంఘం చేపట్టనున్న “నిరసన” కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు GCLA475 రాష్ట్ర సంఘం తీర్మానం చేసిందని అధ్యక్ష కార్యదర్శులు రమణా రెడ్డి, కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమములొ తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల పలు సమస్యల పరిష్కారము కొరకు GCLA475 రాష్ట్ర సంఘము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.
కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీ ప్రకారము వెంటనె నియమ నిబంధనలు విడుదల చెసి ఈ నెల 31 లొపు బదిలీలు (స్దాన చలనం పక్రియ పూర్తి చెయాలని, అలాగే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ బద్రత కల్పిస్తూ DA & HRA మంజూరి చేసి నెల నెల వేతనాలు ఇవ్వాలని, GO 16 పై ఉన్న కోర్టు కేసు పరిష్కరానికి కృషి చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ పూర్తి చెయాలని మరియు ఉద్యోగులకు PRC ప్రకటించి కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా ఆమలు చేయాలని, ఎవరైనా చనిపోతే, నష్టపరిహారము ఇవ్వాలి,వారి కుటుంబములో ఒకరికి అర్హతలను బట్టి ఉద్యొగము ఇవ్వాలి ఒక ప్రకటనలో తెలిపారు.