బదిలీల పై నేడు సీఎస్ ను కలవనున్న కమీషనర్ .!

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీల పైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం.

సీఎస్ సోమేశ్ కుమార్ ఈ రోజు ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ తో 2013లో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు చేసిన బదిలీల గైడ్లైన్స్ మరియు బదిలీలు చేయడానికి గల ఇతర మార్గాల పై సమీక్ష నిర్వహించున్ననట్లు సమాచారం.

బదిలీలకు సంబంధించి నవంబర్ 15 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ప్రకటన చేసిన నేపథ్యంలో బదిలీ మార్గదర్శకాల తయారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే.

సీఎస్ తో ఉమర్ జలీల్ సమీక్ష అనంతరం బదిలీల ప్రక్రియ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.