పదోన్నతులకై జూనియర్ లెక్చరర్ ల మహాధర్నా

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్ లకు వెంటనే ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు కల్పించాలని ప్రధాన డిమాండ్ తో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ల సంఘం మరియు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఆవరణలో మహాధర్నా కార్యక్రమం అధ్యక్షుడు మదుసుధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది జూనియర్ లెక్చరర్ లతో జరుగుతుంది.

పదోన్నతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య నిమిత్తం నిధులు విడుదల చేసి కళాశాలను సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన మరియు బోధనేతర సిబ్బంది పోస్టులకువెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని పేర్కొన్నారు.

ఈ మహాధర్నా లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్ లు పాల్గొన్నారు.