జూనియర్ కళాశాలల పునఃప్రారంభానికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఉన్నత విద్యా శాఖ.

తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలను ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభం పై మార్గదర్శకాలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ కు సంబంధించిన మార్గదర్శకాలు కింది విధంగా ఉన్నాయి.

 • జూనియర్ కళాశాలలు పిబ్రవరి 1 నుండి పునర్ ప్రారంభమగును.
 • విద్యార్థులు కచ్చితంగా తల్లిదండ్రుల నుండి నో అబ్జెక్షన్ లెటర్ ను తీసుకొని రావలసి ఉంటుంది లేకపోతే ఆ విద్యార్థులకు కళాశాలలో ప్రవేశం లేదు
 • మాస్కులు లేకుండా ఎవరికీ కళాశాలల్లో ప్రవేశం లేదు. లెక్చరర్లు, విద్యార్థులు, ఇతర సిబ్బంది కచ్చితంగా మాస్క్ ధరించాలి
 • కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలను పూర్తిగా శానిటేషన్ చేయించాలి. కళాశాల ప్రారంభం కంటే ముందే పూర్తిగా శానిటేషన్ చేపించి, పై అధికారులకు వారం వారం శానిటేషన్ పనులను నివేదించాలి.
 • కళాశాల ప్రిన్సిపాల్ ప్రతి రోజూ తరగతి గదులను, బెంచీలను, బోర్డులను, కుర్చీలను, డోర్ హ్యాండిల్స్ ను సోప్ వాటర్ లేదా శానిటైజర్ తో శుభ్ర చేపించాలి. అలాగే కళాశాల సిబ్బంది, విద్యార్థులు కాకుండా బయట వ్యక్తులకు కళాశాల ఆవరణలో కి ప్రవేశం లేదు. అలాగే సిబ్బంది విద్యార్థులలో ఎవరికైనా జలుబు జ్వరం మరియు కొవిడ్ లక్షణాలు ఉంటే వారికి కళాశాలల్లో ప్రవేశం లేదు. ప్రతి కళాశాల రెండు ఐసోలేషన్ గదులు ఎర్పాటు చేయాలి.
 • 300 లోపు విద్యార్థులు ఉండి సరిపోను తరగతి గదులు ఉన్న కళాశాలలు సాధారణ టైం టేబుల్ ప్రకారం ఉదయం 9:30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలను యధావిధిగా నడిపించాల్సి ఉంటుంది.

 • ఏ కళాశాలలో అయితే 300 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో ఆ కళాశాలలు షిప్ట్ పద్ధతిలో నడపాల్సి ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 12 :30 నిమిషాల వరకు రెండవ షిప్ట్ మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే మొదటి షిప్ట్ కచ్చితంగా సెకండియర్ తరగతులను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ ను జనవరి 16 లోపు సమర్పించాల్సి ఉంటుంది
 • కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలాగా, తరగతులలో బేంచికి ఒక్కరు చొప్పున గరిష్టంగా 30 మంది విద్యార్థులకు మాత్రమే తరగతి గదిలోకి అనుమతించాలి.
 • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తన అకడమిక్ క్యాలెండర్ను సెప్టెంబరు ఒకటి నుండి ఏప్రిల్ 31 వరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజారిటీ సిలబస్ పూర్తయిన నేపథ్యంలో మిగతా సిలబస్ ను భౌతిక తరగతుల ద్వారా పూర్తి చేయాలి.
 • ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కేవలం 70 శాతం సిలబస్ తో మాత్రమే నిర్వహించబడును. మిగతా 30 శాతం సిలబస్ ను విద్యార్థులకు అసైన్మెంట్స్/ ప్రాజెక్టుగా సంబంధిత లెక్చరర్ బోధించాలి.
 • పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేవు. కాకపోతే విద్యార్థుల సౌలభ్యం కోసం ఎక్కువ ఛాయిస్ గల ప్రశ్న పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులకు పరీక్షలు సులభంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
 • భౌతికంగా తరగతుల ప్రారంభమైనప్పటికీ డిజిటల్ తరగతులు యధావిధిగా మార్చి 31 వరకు నూతన టైం టేబుల్ ప్రకారం ప్రసారం అవుతాయి.
 • అన్ని కళాశాలలు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన డిజిటల్ తరగతులను అందులో సేవ్ చేసుకొని ఎవరికైతే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదో వారికి ఆ తరగతులను అందుబాటులో ఉంచాలి.
 • రెసిడెన్షియల్ కళాశాలలు /హాస్టళ్లలో సంబంధిత ప్రిన్సిపాళ్లు, అధికారులు విద్యార్థులు కోవిడ్ నిబంధనల పాటించడంలో మరియు హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడం లో పూర్తి బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
 • డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ కమిటీ (DLMC) కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తో కలిపి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో DIEO, DEO, DMHO, DPO మరియు ఒక కళాశాల ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారు. కళాశాలలో తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ఈ కమిటీకి DIEO రిపోర్టు చేయవలసి ఉంటుంది.

పై నిబంధనలు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఇతర జూనియర్ కళాశాల కు పూర్తిగా వర్తించును.