PMTA TS సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఆస్సోసియేషన్ (PMTA ) 2021 సంవత్సరం నూతన క్యాలెండర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి వారి కార్యాలయంలో ఆవిష్కరించారని రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో MLC లు కాటేపల్లి జనార్ధనరెడ్డి,కూర రఘోత్థం రెడ్డి, PRTU అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, PMTA రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్,ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలుసమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రికి విన్నవించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ లతో పాటు మోడల్ స్కూల్ టీచర్స్ ప్రమోషన్లు, బదిలీలు కూడా చేపట్టాలని, గత ప్రభుత్వంలో దశల వారి నియామకాలను చేపట్టడం వలన ఉపాధ్యాయులకు కలిగే నష్టాన్ని నోషనల్ సర్వీస్ కల్పించడం ద్వారా ఉపాద్యాయులకు న్యాయము చేయాలని, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని విన్నవించడం జరిగింది.

మంత్రి స్పందిస్తూ త్వరలో ప్రమోషన్లు, బదిలీలు చేపడతామని, అన్ని సమస్యలు ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం చేస్తామని హామీని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, తిరుపతి గౌడ్, నాగేశ్వరరావు, లింగ స్వామి, అప్పాల అశోక్, విఠల్, బబ్లా నాయక్ , జయప్రకాష్ , అక్కెనపల్లి శ్రీనివాస్, విజయ్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.