ఆమ్మ ఒడి లో బాగంగా ఉచిత ల్యాప్ ట్యాప్ లు – జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడి పథకంలో భాగంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు.

4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తామని జగన్ తెలిపారు.

రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్‌ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని. పీపీ-1, పీపీ-2, ప్రీ ఫస్ట్ క్లాస్‌గా కొనసాగుతాయని’’ సీఎం జగన్ పేర్కొన్నారు.