తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభు త్వం పరిష్కరిస్తుందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదన్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటివరకు 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. హైదరాబాద్ ఐటీలో 2 లక్షలు, ప్రైవేటు రంగాల్లో 14 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే నిరుద్యోగులకు భృతి అందిస్తామన్నారు.