రెండవ శనివారం పని దినమా.? సెలవునా.?

కరోనా కారణంగా గత సంవత్సరం మార్చి నెల నుండి మూతబడిన విద్యాసంస్థలు ఇంకా తెరుచుకొని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2019 సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ తరగతులను పాఠశాలలు, కళాశాలల యందు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ సెలవులు ప్రకారం అన్ని రెండవ శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించింది.

అలాగే విద్యా సంస్థలకు సంబంధించిన సెలవులను విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లు ప్రత్యేకంగా నిర్ణయిస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

అయితే స్కూల్ ఎడ్యుకేషన్ లో మాత్రం ఈ విద్యా సంవత్సరం కూడా రెండవ శనివారాలు సెలవు దినాలుగానే ఉన్నాయి.

కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం తన అకాడెమిక్ కెలండర్ లో అన్ని రెండవ శనివారాలు జూనియర్ కళాశాలల్లో వర్కింగ్ డేస్ గానే ప్రకటించింది. ఇప్పటికే కరోనా కారణంగా విద్యా సంవత్సరంలో విలువైన పని దినాలను కోల్పోయిన నేపథ్యంలో రెండవ శనివారాలను వర్కింగ్ డేస్ గా మార్చినట్లు సమాచారం.