దేశంలో ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు, IIT లో ప్రవేశానికి జరిగే JEE-అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. జేఈఈ-అడ్వాన్స్డ్-2021 పరీక్షను ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహిస్తుందని రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
ఈ సంవత్సరానికి ఐఐటీల్లో అడ్మిషన్లు కోరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో సాధించాల్సిన 75 శాతం మార్కుల నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
2021 జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించకున్నా, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావచ్చు.
ఇంతకుముందు నిబంధనల ప్రకారం జేఈఈ-మెయిన్‌లో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ వస్తేనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగలరు. ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించినా.. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. దేశంలోని ఇతర ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జేఈఈ-మెయిన్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో కింది వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.