ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఖాళీగా ఉన్న 358 నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనర్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టులను భర్తీ చేయనుంది. పురుషులు మాత్రమే అర్హులు.
అర్హతలు ::
- నావిక్ జనరల్ కేటగిరీ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
- నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- యాంత్రిక్ పోస్టులకు పదో తరగతి పాసవడంతోపాటు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
వయో పరిమితి :: 18 నుంచి 22 సం. మద్య ఉండాలి.
ఎంపిక పద్దతి :: వ్రాత పరీక్ష ఆధారంగా. పరీక్షలు నాలుగు స్థాయిల్లో ఉంటాయి.
రాత పరీక్ష ::
స్టేజ్-1 పరీక్షలు మార్చి నెలలో,
స్టేజ్-2 ఏప్రిల్ లేదా మే నెలల్లో,
స్టేజ్-3, 4 పరీక్షలు ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఉంటాయి.
దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
ఫీజు :: రూ.250 (ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజులేదు.)
చివరితేదీ :: జనవరి 19
వెబ్సైట్ ::
https://joinindiancoastguard.cdac.in