కరోనా కారణంగా ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థుల ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు వింటున్న నేపథ్యంలో వాళ్లకు ఆన్లైన్ తరగతులు అర్థమవుతున్నాయా లేదా అని చిన్న చిన్న పరీక్షలను ఇక 85955 24405 నంబర్ వాట్సాప్ ద్వారా “వాట్సాప్ బేస్డ్ చాట్బూట్ యాప్” ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ ద్వారా వారానికి ఒక సారి అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. 85955 24405 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపాలి.
విద్యార్థి పేరు, తరగతి, మీడియం వివరాలు నమోదు చేయాలి.తరగతుల వారిగా ప్రతీవారం రెండు సబ్జెక్టులకు సంబంధించిన 8-10 ప్రశ్నలు వాట్సాప్‌లో పంపుతారు. వాటికి సమాధానం ఇచ్చిన కొద్ది క్షణాల వ్యవధిలో తప్పో, రైటో తేల్చేస్తారు. తప్పు సమాధానాలకు సంబంధించిన వీడియో పాఠాలను వాట్సాప్ ద్వారా పంపుతారు.
ఈ వినూత్న యాప్‌ను ‘ ఇంటింటా చదువుల పండుగ- వాట్సాప్ బేస్డ్ చాట్ బూట్’ను సోమవారం నుంచి విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. MCHRD లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించారు.