మోడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ నిబంధనలు వెంటనే అమలు చేయాలి

మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లకు నోషనల్ సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని ఈరోజు PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ టీచర్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగింది.

2012లో ప్రత్యేక డియస్సీ ద్వారా నియమితులైన మోడల్ స్కూల్ టీచర్లు సీనియారిటీ జాబితాలో ముందు ఉన్నప్పటికీ జూనియర్ల కంటే తక్కువ వేతనాలు (దాదాపు 10 వేలు) పొందుతున్నారు, అలాగే అనేక సీనీయారిటి సంబంధింత బెనిఫిట్స్ ను కోల్పోతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే మోడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ నిబంధనలను అమలు చేసి ఆదుకోవాలని విన్నవించారు.

2008 మరియు 2012 సాదరణ డీఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు కూడా ఇదే విధమైన సమస్య వస్తే APAT, SO NO 4800/2015. dt :: 15/11 2015 మరియు AO NO 593/2016. dt :: 24/02/2016 ఉత్తర్వుల ద్వారా తెలంగాణ విద్యాశాఖ వారికి నోసషల్ సర్వీస్ కల్పించడం జరిగింది. కావున అదే నిబంధనలను మోడల్ స్కూల్ టీచర్లకు కూడా కల్పించాలని ప్రభుత్వానికి PMTA TS సంఘం తరఫున తరాల జగదీష్ విజ్ఞప్తి చేశారు.

నోషనల్ సర్వీస్ నిబంధనలు అమలు చేస్తే సీనియార్టీ లిస్టు తయారు చేయడానికి వీలవుతుందని, తద్వారా పదోన్నతులు, బదిలీలు వంటివి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం అనుకున్న విధంగా త్వరితగతిన అమలు జరగడానికి అవకాశం ఉంటుందని తరాల జగదీశ్ అభిప్రాయపడ్డారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ గతంలో ఈ సమస్యను విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, మరొక్కసారి ఇదే విషయాన్ని విషయాన్ని గుర్తు చేసి తిరిగి పరిశీలించే విధంగా కృషి చేస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసికొని వెళ్తానని హామీ ఇచ్చారు.

2012లో ప్రత్యేక డీఎస్సీ ద్వారా నియమితులైన మోడల్ స్కూల్ టీచర్లను దశలవారీగా విధుల్లోకి తీసుకోవడం వలన సర్వీస్ కాలము కోల్పోవడం జరిగింది. కావున ఈ సర్వీస్ కాలానికి నోసషల్ సర్వీస్ నిబంధనలను అమలు చేస్తూ సర్విస్ గ్యాప్ ను పూరించ వలసినదిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. నోషనల్ సర్వీస్ ఇవ్వడం వలన సర్వీస్ కాలము పెరిగి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, ప్రధాన కార్యదర్శి పొచయ్య, కన్వీనర్ సయ్యద్ సలీం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫసీ అహ్మద్, పురుషోత్తం, కలీల్ అహ్మద్, సత్తయ్య తదితరులు కలిశారు.