ఇంటర్ వోకేషనల్ కోర్స్ గా రోబోటిక్స్

ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులను కాలానుగుణంగా అప్ గ్రేడ్ చేస్తూ విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించేవిగా మార్చాలని భావిస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వాటి పాఠ్య ప్రణాళికలో మార్పులు చేస్తోంది.

ఎంటెక్‌, బీటెక్‌ కోర్సులకే పరిమితమైన రోబోటిక్స్‌ వంటి కోర్సులను ఇకనుంచి ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఒకేషనల్‌ కోర్సుల్లో చేర్చాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది.

ప్రస్తుతం ఇంటర్‌ ఒకేషనల్‌ విద్య లో 6 విభాగాల కింద 22 కోర్సులను అందిస్తున్నారు. వాటిల్లో మొత్తం 95 వేల మంది చదువుతున్నారు.

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ఆరు కోర్సులు అందిస్తున్నారు. వాటిలోని మెకానికల్‌ టెక్నీషియన్‌(ఎంటీ) కోర్సులో ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ పేరిట సిలబస్‌ను కలుపుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒక్కో పేపర్‌ చొప్పున దానిపై పాఠ్యప్రణాళిక ఉండనుందని సమాచారం