రిలయన్స్ జియో తమ కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జి (IUC) విధానం శుక్రవారం (డిసెంబర్ 31) తో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది. ‘ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
మరోవైపు వొడాఫోన్- ఐడియా కూడా తమ అన్లిమిటెడ్ ప్యాక్ యూజర్లకు జనవరి 1 నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది