ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. ఈ మేరకు టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం అందింది.
దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు కేసీఆర్తో భేటీ కానున్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి ఉద్యోగులతో మాట్లాడే అవకాశం ఉన్నది.
ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి చివరి కల్లా పరిష్కారమవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది మ.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని నిర్ణయించిన విషయం విదితమే.