సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)-2021 కి గాను 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. జూలై 15న పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి లో ప్రాక్టికల్ పరీక్షలు జరపనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మీడియాకు వెల్లడించారు.