భద్రాద్రి జిల్లా ఇంటర్ విద్యా నోడల్ ఆపీసర్ జహీర్ అహ్మద్ ఆకస్మిక మృతి

భద్రాద్రి జిల్లా ఇంటర్ విద్యా నోడల్ ఆపీసర్ గా విధులు నిర్వహిస్తున్న జహీర్ అహ్మద్ ఆకస్మికంగా మృతి చెందారు. కొత్తగూడెంలోని వేపల గడ్డలో తన నివాస గృహంలో మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కెమిస్ట్రీ అధ్యాపకునిగా తన ప్రస్థానం ప్రారంభించి, ఎంతో మంది విద్యార్థులకు సుదీర్ఘకాలంపాటు విద్యను అందించారు.

తొలుత భద్రాచలం పట్టణంలో చాలా ఏళ్లుగా కెమిస్ట్రీ ట్యూషన్స్ చెప్పారు. అనంతరం పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు. తదుపరి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా పని చేశారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తూ…. RIO , DIEO గా వ్యవహరించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 రిటైర్మెంట్ ఉండగా… రెండు రోజులు ముందుగా జహీర్ గారు మరణించడం పలువురుని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా , ఉన్నతాధికారిగా ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు చేత ప్రశంసలు అందుకున్నారు. ఎంతో సౌమ్యుడిగా ఉండే జహీర్ ఆహద్ గారు ఇక లేరు అనే వార్త…. యావన్మంది శిష్యులను, స్నేహితులను తీవ్ర కలవరానికి గురి చేసింది. జహీర్ గారి మృతి ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి, ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, కొత్త గూడెం, ఖమ్మం జిల్లా సంఘ నాయకులు వినోద్, వెంకన్న, మురళి, జాన్ లు సంతాపం తెలిపారు.