జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ ఏడాది నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వివరాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే JEE MAIN నాలుగు దశలలో నిర్వహించే పరీక్షలకు విడివిడిగా దరఖాస్తు చేయాలా, ఒకేసారి దరఖాస్తు చేయాలా అనే సందేహాలు విద్యార్థులలో నెలకొన్న నేపథ్యంలో జాతీయ పరీక్షల విభాగం (NTA) దానిపై స్పష్టత ఇచ్చింది
JEE MAIN నాలుగు పరీక్షలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది నాలుగు పరీక్షలలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే విద్యార్థి ఉత్తమ స్కోర్ గా పరిగణిస్తామని కూడా తెలియజేసింది.