జనవరిలో విద్యా సంస్థల ప్రారంభం కష్టమే.!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయాలు ఒకవైపు కరోనా వైరస్ నూతన రూపమైన స్ట్రెయిన్ వైరస్ భయం మరోవైపు వెంటాడుతున్న వేల తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు మరియు కళాశాలలు పునఃప్రారంభం పై సందిగ్దత కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం మరియు అధికారులు జనవరి 16 తర్వాత పాఠశాలలు/కళాశాలలను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కళాశాలలు /పాఠశాలలు జనవరి 16న కూడా ప్రారంభం కావడం అనుమానంగానే ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు జనవరి 16 తర్వాత కూడా విద్యాసంస్థలు ప్రారంభం సాధ్యం కాదని ఆన్లైన్ లోనే తరగతులను కొనసాగించాలని, విద్యార్థుల ఆరోగ్యం కంటే విద్యా సంవత్సరం ముఖ్యం కాదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం రద్దు చేసి ప్రమోట్ చేసే ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం పై తరగతుల పట్ల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.