తెలుగు కు అధికార భాష హోదా ఇచ్చిన రాష్ట్రం ఏది.?

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు అధికార భాషా హోదా ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్‌లో భాషాపరమైన మైనారిటీలుగా మమతా బెనర్జీ ప్రభుత్వం గుర్తించింది.

దీనికి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్‌ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.