డిగ్రీ, పీజీ కాలేజీల్లో అడ్మిషన్లు పొంది పలు కారణాలతో రద్దు చేసుకొనే విద్యార్థులకు వారు చెల్లించిన పూర్తి ఫీజును తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీచేసింది.
ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అంతకంటే ఉత్తమ విద్యా సంస్థలో సీటు వస్తే మొదటి కాలేజీలో అడ్మిషన్ రద్దు చేసుకున్నా ఫీజు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ స్పష్టంచేసింది.
ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు అడ్మిషన్లు రద్దు చేసుకున్న, ఇతర కాలేజీలకు అడ్మిషన్లు మార్చుకున్న విద్యార్థులకు సేవా చార్జీలు కూడా వసూలు చేయకుండా మొత్తం ఫీజును తిరిగి చెల్లించాలని సూచించింది.
డిసెంబర్ 31 నాటికి అడ్మిషన్లు మార్చుకున్న, రద్దు చేసుకున్న విద్యార్థులకు రూ.1000 వరకు మినహాయించుకొని మిగతా ఫీజు చెల్లించాలని ఆదేశించింది.