కాంట్రాక్టు అధ్యాపకులతోనే TIPS.

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలోపేతం కొరకు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కై వ్యవస్థలోని ఉద్యోగులందరితో చేయి, చేయి కలిపి పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల శ్రమ దోపిడీని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 16ను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసినదే.

కానీ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల క్రమబద్దీకరణ ప్రక్రియ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవం. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జరిగే వరకు మీవెంటే ఉంటామని తెలియజేస్తూ ఈ జరిగే ప్రక్రియలో మా సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తున్నాం.

ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయంతో ఉన్నందువలన కాంట్రాక్టు అధ్యాపక మిత్రులు అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి తరపున రాష్ట్ర సమన్వయ కర్త జంగయ్య, కన్వీనర్ లు ఆర్కే గౌడ్, కొప్పిశెట్టి సురేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు