మోడల్ స్కూల్ టీచర్ల డిఫర్మెంట్ అమౌంట్ మరియు డిఏ బకాయిలు విడుదల.

మోడల్ స్కూల్ టీచర్ల డిఫర్మెంట్ అమౌంట్ మరియు డిఏ బకాయిలు సంబంధించిన బిల్లులకు మంగళవారం నాడు ఆర్థిక శాఖ 82.24 కోట్ల బడ్జెట్ ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఈ నెల 7నతేదీన మోడల్ స్కూల్ టీచర్ల డిఫర్మెంట్ అమౌంట్ మరియు డిఏ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మాత్యులు హరీష్ రావుని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PMTA TS) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, అక్కెనపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్,స్వామి,సతీష్ రెడ్డి,వేణు తదితరులు కలసి విన్నవించడం జరిగింది.

మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఆర్థిక శాఖ 82.24 కోట్ల బడ్జెట్ ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.అందుకు గాను రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ మంత్రివర్యులు హరీష్ రావుకి ఇందుకు కృషి చేసిన MLC లు జనార్ధన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి మరియు PRTU అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు లకు మోడల్ స్కూల్ టీచర్స్ తరుపున, PMTA సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.