DOST స్పాట్ కౌన్సెలింగ్.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) మరొక ప్రత్యేక కౌన్సిలింగ్ కు అవకాశం కల్పించింది.

ప్రత్యేక కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన సెల్ఫ్ రిపోర్ట్ చేయని మరియు కళాశాలల యందు చేరని విద్యార్థులు డిసెంబర్ 17 వ తేదీన ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందవచ్చు అని తెలిపింది.

అలాగే 18వ తేదీన మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ ను నిర్వహించనున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.