JEE MAINS 2021 షెడ్యూల్ విడుదల.

దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) డిసెంబ‌రు 15న‌ JEE MAIN 2021 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సారి నాలుగు సార్లు పిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు డిసెంబ‌రు 15 నుంచి జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది ఎన్టీఏ ప్రకటించింది.

ఫీజు చెల్లింపునకు తుదిగడువు జనవరి 16 గా నిర్ణయించింది.

దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు జనవరి 18 నుంచి 21 వరకు అవకాశం ఇచ్చింది.

హాల్‌టిక్కెట్లు ఫిబ్రవరి మొదటి వారంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

తొలి విడత పరీక్ష తేదీలు ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12వరకు మరియు మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు) నిర్వహించనున్నారు.

విద్యార్థులు ఒకేసారి లేదా నాలుగు సార్లయినా రాసేందుకు వెసులుబాటు ఉంది. నాలుగు సార్లు రాస్తే ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే పరిగణలోకి తీసుకోనున్నారు.

ఈ ఏడాది కరోనా కారణంగా సీబీఎస్‌ఈ గానీ, పలు రాష్ట్రాల బోర్డులు గానీ సిలబస్‌ తగ్గించినప్పటికీ NTA మాత్రం జేఈఈ మెయిన్స్‌లో సిలబస్‌ తగ్గించలేదని తెలుస్తోంది.

మే తర్వాత లేదా జూన్‌ చివరి వారంలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.