తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో గాలి నాణ్యత పెంచే లక్ష్యంతో, పెరుగుతున్న వాయు కాలుష్య మూలాలను గుర్తించి నివారించేందుకు చర్యలు చేపట్టడానికి ఐఐటీ కాన్పుర్ తో కలిసి అధ్యయనాన్ని చేపట్టనుంది.
హైదరాబాద్లో కాలుష్యంపై చివరిసారి 2006లో అధ్యయనం జరిగింది. అప్పటి గణాంకాల ఆధారంగానే ఇప్పటికీ కాలుష్య నియంత్రణ కార్యాచరణ అమలవుతోంది.