లా సెట్ అడ్మిషన్ల షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని లా కాలే‌జీలలో ఐ‌దేండ్లు, మూడేండ్లు కోర్సులకు మరియు రెండేడ్ల పీజీ కోర్సులకు లా కాలే‌జీల్లో సీట్ల భర్తీకి డిసెంబర్ 14 నుంచి అడ్మి‌షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

డిసెంబర్ నెల 22 వరకు ఆన్‌‌లైన్‌ రిజి‌స్ర్టే‌షన్లు, ఆన్‌‌లైన్‌ పేమెంట్‌ ప్రక్రియ కొన‌సా‌గ‌ను‌న్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు స్పెషల్‌ క్యాట‌గిరీ వారు నేరుగా కౌన్సె‌లింగ్‌ కేంద్రా‌లకు హాజరు కావాల్సి ఉంటుంది.

కౌన్సె‌లిం‌గ్‌‌కోసం రిజి‌స్టర్‌ చేసు‌కున్న విద్యా‌ర్థుల జాబి‌తాను 24న విడు‌దల చేస్తారు. 26, 27 తేదీల్లో తొలి విడుత వెబ్‌‌ఆ‌ప్షన్ల నమోదు కొన‌సా‌గ‌ను‌న్నది. 28న ఎడిట్‌ ఆప్షన్‌, 29న సీట్లు కేటా‌యి‌స్తారు. సీట్లు పొందిన విద్యా‌ర్థులు 31 వరకు కాలే‌జీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని అడ్మి‌షన్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ జీబీ‌రెడ్డి తెలి‌పారు.

వివరాలకై క్రింది వెబ్సైట్ ను సందర్శించండి

https://lawcetadm.tsche.ac.in/#