ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించనున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి.

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ డిసెంబర్ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా వేదికగా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విద్యాసంస్థలు మరియు జాతీయస్థాయి పరీక్షలపై సూచనలు, సందేహాలు, సలహాలను స్వీకరించుటకు టీచర్లకు అందుబాటులోకి రామన్నారు.

ట్విట్టర్ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లు, అధ్యాపకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. కావున టీచర్లు అధ్యాపకులు ట్విట్టర్ వేదికగా సలహాలు సూచనలతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

#EducationMinisterGoesLive అనే హ్యష్ ట్యాగ్ పై మీ సలహాలు సూచనలు సందేహాలను అడగవచ్చు.