రైల్వే శాఖలో గత ఏడాది జారీ చేసిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన 1.4 లక్షల పోస్టుల భర్తీకి డిసెంబరు 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు తెలిపింది. ఈ ఉద్యోగాల కోసం 2.44 కోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ పరీక్షల కేంద్రాల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపుతారు. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లో పరీక్షల తేదీ, షిఫ్ట్ వివరాలు ఉంటాయి. పరీక్షకు నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్‌ను ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం పరీక్షల్లో కనిపించిన మెరిట్ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
మూడు రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు
● ఐసోలేటెడ్, మినిస్టీరియల్ కేటగిరీ – 1,663
● నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ – 35,208
● ఆర్ఆర్సీ లెవెల్-1 – 1,03,769