TSPSC ద్వారా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం – ఘంటా చక్రపాణి

TSPSC ఆరేళ్ళలో 149 నోటిఫికేషన్ల ద్వారా 35,724 ఉద్యోగాలను భర్తీచేసిందని TSPSC చైర్మన్‌ ఘంటా చక్రపాణి కమిషన్‌ సభ్యులతో కలిసి ఆయన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు టీఎస్‌పీఎస్సీ ఆరో వార్షిక నివేదికను అందజేశారు.

అనంతరం చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో 39,952 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. అందులో 36,758 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు. 35,724 ఉద్యోగాల నియామక ఎంపిక ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. గురుకుల, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 20 వేల టీచర్‌ పోస్టులను భర్తీచేశామని ఆయన పేర్కొన్నారు.