హైదరాబాద్ గూగుల్ క్యాంపస్ లో ఇంటర్న్‌షిప్

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌లో విద్యార్థులకు ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 పేరుతో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం. 

హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది గూగుల్. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. 

ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాలి.

● విద్యార్హతలు :: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి. 

చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.

● ఇతర అర్హతలు :: 

జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. 

సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గరిథమ్స్ తెలిసి ఉండాలి. 

వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.

● దరఖాస్తుకు చివరి తేదీ  :: 

2020 డిసెంబర్ 11

● ఇంటర్న్‌షిప్ గడువు ::

12 నుంచి 14 వారాలు

● వెబ్సైట్ :: 

https://careers.google.com/