తెలంగాణ లోని సికింద్రాబాద్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చే ఏడాది ప్రాంరభంలో జరగనుంది. సికింద్రాబాద్ AOC సెంటర్లో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆర్మీ నియామక ర్యాలీని నిర్వహించనున్నారు.
సోల్జర్ టెక్ (AE), సోల్జర్ జనరల్ డ్యూటీ (GD), సోల్జర్ ట్రేడ్స్‌మెన్, అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ)లో ఎంపిక నిమిత్తం నియామక ర్యాలీని చేపడుతున్నారు.
అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ) కింద ఉన్నవారు 2021 జనవరి 15న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లోని AOC సెంటర్ లోని థాపర్ స్టేడియంలో స్పోర్ట్స్ ట్రయల్ కోసం రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు.
● అర్హతలు ::
★ అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ)
బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబ్బడి రంగాలలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ జాతీయ లేదా అంతర్జాతీయ పోటీల సీనియర్ లేదా జూనియర్ విభాగాల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
స్క్రీనింగ్ సమయానికి సర్టిఫికేట్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉండకూడదన్నారు.
* వయస్సు :: 17.5 నుంచి 23 ఏళ్లు.
* విద్యార్హత :: 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 50 శాతం మార్కులు ఉండాలి.
★ సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) :
* విద్యార్హత :: మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి
* వయస్సు :: 17.5 నుంచి 21 ఏళ్లు
★ సోల్జర్ ట్రేడ్‌మెన్ ::
* విద్యార్హత :: 10వ తరగతి పాస్ కావాలి
* వయస్సు :: 17.5 నుంచి 23 ఏళ్లు.
★ సోల్జర్ టెక్ (AE) ::
* విద్యార్హత :: సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి, 50 శాతం మార్కులు ఉండాలి.
* వయస్సు :: 17.5 నుంచి 23 ఏళ్లు.
● ముఖ్యమైన తేదీలు ::
* స్పోర్ట్స్ ట్రయల్ నిర్వహించే తేదీ :: 2021 జనవరి 15
* ఆర్మీ ర్యాలీ ప్రారంభ తేదీ :: జనవరి 18 – 2021
* ఆర్మీ ర్యాలీ చివరి తేదీ :: ఫిబ్రవరి 28 – 2021
● వేదిక :: సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో ఉన్న థపర్ స్టేడియం.
● సంప్రదించంవలసిన మెయిల్ ::
● వెబ్సైట్ :: www.joinindianarmy.nic.in