విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి


క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విద్యార్థుల సందేహాల‌ను సమాదానాలు చెప్పడం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిషాంక్ లైవ్ సెష‌న్ నిర్వ‌హించి CBSE బోర్డు ఎగ్జామ్స్‌ 2021, JEE మెయిన్‌ 2021, NEET 2021కి సంబంధించి వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు చెప్పారు.

NEET – 2021 ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను ర‌ద్దుచేసే ఆలోచ‌నేది త‌మ‌కు లేద‌ని JEE మెయిన్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌తి ఏడాది రెండు కంటే ఎక్కువ‌సార్లు నిర్వహించే విష‌య‌మై ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

CBSE సిల‌బ‌స్‌ను ఇప్ప‌టికే 30 శాతం త‌గ్గించిన‌ట్లు మంత్రి తెలిపారు. తొల‌గించిన చాప్ట‌ర్ల గురించి విద్యార్థుల‌కు తెలియ‌జేయాల‌ని సూచించారు.

CBSE ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హణ‌, వార్షిక ప‌రీక్ష‌ల తేదీల‌కు సంబంధించి ప‌రిస్థితుల‌ను బట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి వివరించారు. ‌