ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ లో బీఫార్మసీ, ఫార్మా-డీ, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ను ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేసారు.
పై కోర్సుల్లో భర్తీ కాని సీట్లతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ తదితర వాటిల్లో మిగిలిన సీట్లను కొత్తగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు కేటాయిస్తారు.
- ఈ నెల 16న స్లాట్ బుకింగ్
- 17న ధ్రువపత్రాల పరిశీలన
- 16 నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
- 21న సీట్లు కేటాయిస్తారు.
స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలను డిసెంబర్ 21న విడుదల చేస్తామని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.