కొత్తగా 7వేల జూనియర్ లెక్చరర్ల పోస్టులు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్రం లోని వెయ్యి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఒక్కో కాలేజీకి కనీసం ఏడుగురు లెక్చరర్లు అవసరం అవుతారని అంచనా అలా వెయ్యి జూనియర్‌ కాలేజీలకు కలిపి 7వేల లెక్చరర్ల పోస్టులు కొత్తగా ఏర్పడుతాయి. ఆ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ లక పదోన్నతుల ద్వారా 70 శాతం పోస్టులను అనగా 4900 మంది స్కూల్ అసిస్టెంట్ లు జూనియర్ లెక్చరర్ లుగా పదోన్నతి పొందనున్నారు, అలాగే మిగిలిన 30 శాతం (2,100) పోస్టులను TSPSC ద్వారా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేస్తారు.