ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ (TOSS) అడ్మిషన్లు ప్రారంభం

తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ (TOSS) ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక కారణాల వలన విద్యను కొనసాగించలేని విద్యార్థుల కోసం ఓపెన్, దూరవిద్య విధానంలో పదవ తరగతి మరియు ఇంటర్ తత్సమాన చదువును పూర్తి చేయడానికి 2020 – 2021 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ డిసెంబర్ – 10 వ తేదీన ప్రారంభం కానుంది.

విద్యార్థులు అడ్మిషన్ల కోసం కింద ఇవ్వబడిన వెబ్ సైట్ నందు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారా నింపవలసి ఉంటుంది.


★ అడ్మిషన్ షెడ్యూల్ కింద విధంగా ఉంది

  • విద్యార్థులు డిసెంబర్ 15వ తేదీ లోపల టీ సేవా/ మీసేవా /ఏపీ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది
  • దరఖాస్తు ఫీజు జనవరి 05 – 2021 వరకు ఉన్నది.
  • అపరాధ రుసుము తో పీజు జనవరి 06 నుండి 15 వరకు చెల్లించవచ్చు.
  • జనవరి 15 2021 అప్లికేషన్ టీ సేవా/ మీసేవా /ఏపీ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.

● వెబ్సైట్ :: https://www.telanganaopenschool.org/