డిగ్రీతో పాటే అప్రెంటిస్‌షిప్ UGC కొత్త నిబంధనలు

సాధారణ డిగ్రీ తో ఉద్యోగాలు కల్పించడం సవాళ్లతో కూడుకున్నందున డిగ్రీ చదివే సమయంలోనే నచ్చిన ఇతర సబ్జెక్టులో అప్రెంటిస్‌షిప్‌ను చేసుకొనే అవకాశం విద్యార్థులకు కల్పిస్తూ UGC మార్గదర్శకాలు విడుదల చేసింది. అప్రెంటిస్‌షిప్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి అనే నిబంధన కూడా పెట్టింది.

విద్యార్థులు తాము చదివే డిగ్రీ కోర్సుతో పాటు ఇతర కోర్సుల్లోని కోర్‌ సబ్జెక్టులో అప్రెంటిస్‌షిప్‌ చేసి 24 క్రెడిట్లు సాధిస్తే ఆయా సబ్జెక్టులో పీజీలు కూడా చేసుకోవచ్చు. దీని వలన విద్యార్థి బహుళ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసినట్లు అవుతుంది.

అయితే ప్రధాన కోర్సుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక సెమిస్టర్‌ లో మాత్రమే అప్రెంటిస్‌షిప్‌ ఉండేలా కోర్సులను రూపొందించాల్సి ఉంటుందని UGC తెలిపింది.

అప్రెంటిస్‌షిప్‌ కోర్సులను ప్రవేశపెట్టే ముందు విద్యాసంస్థ‌లు, పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలి. విద్యార్థులకు శిక్షణను తప్పనిసరిగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థ‌ల్లోనే అందించాలి. పరిశ్రమల్లో ఉండే మౌలిక సదుపాయాలకు అనుగుణంగానే కోర్సుల్లో సీట్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని UGC తెలిపింది.