TTC (DEE CET) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని DEE CET (డైట్ సెట్) రాసిన అభ్యర్థులకు మొదటి దశ కౌన్సిలింగ్ కు సంబంధించి షెడ్యూల్ ను DEE CET కన్వీనర్ ఈ రోజు విడుదల చేశారు.

డిసెంబర్ 10 నుండి కౌన్సిలింగ్ జరుగుతుంది. డీసెట్ రాసి‌, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ లను ఎందుకోవలసిందిగా కన్వీనర్ తెలిపారు. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D EI Ed), డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ DPSE) లలో (2020 – 2022) రెండు సంవత్సరాల కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ విడుదల చేశారు

● షెడ్యూల్ వివరాలు ::

  • డిసెంబర్ 10 నుండి 14 వ తారీకు వరకు వెబ్ ఆప్షన్ లను అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • డిసెంబర్ 17 నుండి 21 వరకు అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు.
  • డిసెంబర్ 22 నుండి 24 వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించాలి మరియు DEE CET వెబ్ సైట్ నందు అడ్మిషన్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డిసెంబర్ 28 లేదా అంతకు ముందు కళాశాల యందు రిపోర్టు చేయాల్సి ఉంటుంది అని కన్వీనర్ తెలిపారు.

● పూర్తి వివరాలకు క్రింది వెబ్సైట్ ను సందర్శించండి.

http://www.deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

● షెడ్యూల్ ::