భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR) డిపార్ట్మెంట్ గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయడంలో భాగంగా కాంట్రాక్టు ప్రాతిపదికన స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ వంటి 510 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● పోస్టుల వారీగా ఖాళీలు ::
1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 10 పోస్టులు
2) యంగ్ ఫెలో – 250 పోస్టులు
3) క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 250 పోస్టులు
1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ::
క్లస్టర్ మోడల్ గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామపంచాయతీలలో జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేయడం.
● అర్హత :: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎకనమిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం.
- పదో తరగతిలో 60%,
- ఇంటర్మీడియట్లో 50%,
- గ్రాడ్యుయేషన్‌లో 50%,
- పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
● వయసు :: నవంబరు – 01 – 2020 నాటికి 30-50 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
● జీతభత్యాలు ::
నెలకు రూ.55,000/- ఉంటుంది.
దీనితో పాటు ప్రయాణ, ఇతర ఖర్చులను చెల్లిస్తారు.
2) యంగ్ ఫెలో ::
క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలకు వెళ్లి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వారికి గ్రామపంచాయతీ పనులను వివరిస్తూ, అభివృద్ధి పనుల్లో పాల్గొనడం.
● అర్హత :: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎకనమిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం.
- పదో తరగతిలో 60%,
- ఇంటర్మీడియట్లో 50%,
- గ్రాడ్యుయేషన్‌లో 50%,
- పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
● వయసు :: నవంబరు – 01 – 2020 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
● జీతభత్యాలు :: నెలకు రూ.35,000/- ఉంటుంది. దీనితో పాటు ప్రయాణ, ఇతర ఖర్చులను చెల్లిస్తారు.
3) క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ ::
వార్డు స్థాయిలో ప్రజల్ని గ్రామ పంచాయతీ విధుల్లో (గ్రామ సభ, వార్డ్ సభ, మహిళా సభ)పాల్గొనేలా వారిని చైతన్యవంతుల్ని చేయడం.
● అర్హత :: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.
● వయసు :: నవంబరు – 01 – 2020 నాటికి 25-40 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
● జీతభత్యాలు :: నెలకు రూ.12,500 ఉంటుంది. దీనితో పాటు ప్రయాణ, ఇతర ఖర్చులను చెల్లిస్తారు.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్.
● దరఖాస్తుకు చివరి తేది :: 29.12.2020.
● వెబ్సైట్ :: http://nirdpr.org.in/
● నోటిఫికేషన్ pdf ::
https://drive.google.com/file/d/1MJuL5SsgLkVcDN5xDUXqk6ZfVe40SoNm/view?usp=drivesdk