తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలో నడుస్తున్న 34 “ప్రతిభా జూనియర్ కళాశాలల” (COE) యందు 2021 – 2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరం నందు ఎంపీసీ, బైపీసీ, ఎంయీసీ, సీఈసీ గ్రూప్ ల యందు అడ్మిషన్ కొరకు మార్చి 2021 సంవత్సరం లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణలోని బాలబాలికల నుండి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు కోరుచున్నారు.
ఈ ప్రతిభ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంతటి తో పాటు ఐఐటీ, నీట్, క్లాట్ CMA వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ వసతి సదుపాయం కల్పించబడును అని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
● కళాశాల పేరు :: ప్రతిభా కళాశాలలు (గురుకుల సంస్థ ఆధ్వర్యంలో)
● కోర్సులు :: ఎంపీసీ, బైపీసీ, ఎంయీసీ, సీఈసీ కేవలం ఇంగ్లీష్ మీడియం.
● ప్రత్యేకత :: ఐఐటీ, నీట్, క్లాట్ CMA వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ వసతి.
● అర్హత :: 2021 లో పదవ తరగతి ఉత్తీర్ణత.
● దరఖాస్తు పీజు :: 100/-
● దరఖాస్తు ప్రారంభ తేదీ :: డిసెంబర్ – 08 – 2020.
● దరఖాస్తు చివరి తేదీ :: డిసెంబర్ – 31 – 2020.
● వెబ్సైట్ :: https://www.tswreis.in/
● టోల్ ప్రీ నంబర్ :: 1800 4254 5678